నాకు సీఎం జగన్ టికెట్ ఇవ్వలేదనే కారణంతో వైసీపీని వీడలేదని, పొమ్మన లేక పొగపెట్టారని ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) వెల్లడించారు. శనివారం మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
"చంద్రబాబుపై వేసిన కేసులపై న్యాయ పోరాటం చేస్తా. తప్పు ఎవ్వరూ చేసినా తప్పే. సీఎం జగన్ ప్రభుత్వం తప్పు చేస్తే వాటిపై కేసులు వేసేందుకు అయినా వెనకాడను. తప్పులు ఎవరు చేశారు అనేది న్యాయస్థానాలు తేలుస్తాయి." అని ఆర్కే వ్యాఖ్యానించారు.