YSRTP అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్కు వెళ్లేది నిజమే ఐతే.. తానూ ఆమె వెంటే నడుస్తానని ఆళ్ల రామకృష్ణా రెడ్డి(ఆర్కే) వెల్లడించారు. శనివారం మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "వైసీపీకి నేను ఎంత సేవ చేశానో నాకు తెలుసు.
నేను సర్వస్వం పోగొట్టుకున్నాను. వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తిగా వైఎస్ షర్మిల వెంట నడుస్తా. షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే ఉంటా." అని వ్యాఖ్యానించారు.