శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం పాలెం గ్రామంలో బాబు షూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం టిడిపి నాయకులు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అందరూ బాబు ప్రవేశపెట్టిన ప్రధానమైన మినీ మేనిఫెస్టో ను ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసుకుందామని తెలిపారు.