బిహార్ లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. భాగల్పూర్ జిల్లాలోని గోపాల్పూర్ గ్రామానికి చెందిన 75ఏళ్ల రైతు సందీప్ మండల్ వృద్ధాప్య పింఛను ఖాతాలోకి రూ.కోటి వచ్చిందట. వాస్తవానికి రైతు తన కొడుకును పాస్‌బుక్‌ను అప్డేట్ చేయడానికి పంపాడు.
ఇక బ్యాలెన్స్ చూసే సరికి అది కోటి దాటింది. ఆ తర్వాత బ్యాంకు ఖాతాను స్తంభింపజేసింది. శుక్రవారం ఉదయం రైతు స్వయంగా సైబర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఈ మొత్తం విషయాన్ని పోలీసులకు తెలిపాడు.