కేరళలోని తిరునెల్లికి చెందిన వ్యాపారి సున్నీ చెన్నై నుంచి కారులో మైసూర్‌కు వెళ్తున్నారు. మానందవాడి రోడ్డు దగ్గర ఒక మహిళ, ముగ్గురు వ్యక్తులు కారుని ఆపి.. అతడిని బలవంతంగా ఎత్తుకెళ్లారు.
ఆయనను బెదిరించి ఓ మహిళ పక్కన నగ్నంగా పడుకోబెట్టి వీడియోలు, ఫోటోలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతూ వచ్చారు. బెదిరింపులు పెరగడంతో వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.