తిరుమలలో చిరుత, ఎలుగు బంటి సంచారం కలకలం రేపింది. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే అలిపిరి నడక మార్గంలో వీటి సంచారం కనిపించినట్లు అటవీశాఖ అధికారులు ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తించారు.
చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపిన ప్రాంతంలోనే.. ఈ నెల 13, 26 తేదీల్లో ఇవి సంచరించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. గుంపులు గుంపులుగా భక్తులు రావాలని సూచించింది.