అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార బస్సుయాత్ర ముగిసింది. అలాగే నిన్న సాయంత్రం జరిగిన బహిరంగ సభ ఉత్తేజంగా సాగింది. సభ ప్రారంభానికి ముందు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, మంత్రి ఉష శ్రీచరణ్, మాజీమంత్రి పేర్నినాని, ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రసంగించారు. వీరితో పాటు సభలో స్థానిక సంస్థల ఛైర్మన్లు, కార్పొరేటర్లు, సర్పంచులు, కార్పొరేషన్ల ఛైర్మన్లు పాల్గొన్నారు.