వైసీపీ చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా మంత్రి ఉషా శ్రీచరణ్ మాట్లాడుతూ.... సాధికారతకు నిదర్శనం సామాజిక సాధికార బస్సుయాత్ర. జగనన్న ఎప్పుడూ కూడా బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు సంక్షేమ పథకాలలలో పెద్దపీట వేస్తూ వస్తున్నారు. జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడం. ఏ కులమూ తక్కువది కాదని చాటుతున్న జగనన్న...అంబేడ్కర్, ఫూలేల ఆశయాల బాటలో ముందుకు సాగుతున్నారు. మన వర్గాల ప్రజల్ని ముందుకు తీసుకెళుతున్నారు. జగనన్న పాలనతో కళ్లు తెరిచిన టీడీపీ మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నారు. బాబు గతంలో జగనన్న సంక్షేమ పథకాలను విమర్శించారు. ఇప్పుడు నోరెళ్ల బెడుతున్నారు. ఇక జనవరి1, 2024 నుంచి రూ.3వేల పింఛన్ ఇస్తున్నారు సీఎం జగనన్న. హామీలిచ్చి, నెరవేర్చని చంద్రబాబును పట్టించుకోవద్దని కోరుతున్నాను అని తెలిపారు.