వైసీపీ చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.... అంబేద్కర్ కోరుకున్న సామాజిక సాధికారతను నిజం చేసి చూపారు మన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. బడుగు,బలహీనవర్గాలకు, మైనార్టీలకు సామాజిక సాధికారతను సొంతం చేశారు. సామాజిక న్యాయానికి సరైన అర్థం చెప్పారు. సంక్షేమం అంటే ఏదో ఉచిత పథకం కాదని, లబ్దిదారుల కుటుంబాలు మారాలి. వారి పిల్లల తలరాతలు మారాలి అన్న దార్శనిత సీఎం జగన్‌ది. లక్షల కోట్లు ఖర్చు చేసి పేదల ఆర్థిక స్థాయిని పెంచే దిశలో ముందడుగులు వేశారు మన సీఎం. 70శాతం బడుగు, బలహీనవర్గాలకు, పేదలకు సంక్షేమపథకాల లబ్ది అందింది. ఒక్క అనంతపురంలోనే రెండువేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ ఇలా ప్రతి వర్గానికి వందల కోట్లు అందించడం ద్వారా వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. పేదలకోసం రూ.400 కోట్లు విడుదల చేశారు. రూ.800 కోట్లు రోడ్ల కోసం, కాలువల కోసం కేటాయించారు.