బీసీల తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబెక్కడ..? అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిని అని చెప్పుకుంటున్న లోకేశ్..ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి కాదు...జాతికి మాత్రమే ప్రధాన కార్యదర్శి అని ఎద్దేవా చేశారు. బీసీలకు ఆయన ఒక రక్షణ చట్టం తీసుకొస్తానని చెప్తున్నాడు. చరిత్ర తెలుసుకో...లోకేశ్...ఎస్సీ, ఎస్టీల తరహాలో బీసీలకు అట్రాసిటీ చట్టం తెస్తాడట అని ధ్వజమెత్తారు. అలాంటి చట్టాన్ని ముందుగా దాన్ని నీ తండ్రి నారా చంద్రబాబునాయుడు పైనే ప్రయోగించాల్సి వస్తుందన్నారు.