అంగన్వాడీలు ప్రభుత్వ పరిస్థితిపై అర్థం చేసుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. మా ప్రభుత్వం వచ్చి వెంటనే వేయి రూపాయాలు పెంచుతాం అని హామీ ఇచ్చాం.. అదే మాదిరిగా రూ.11 వేలు ఇచ్చాం అన్నారు. పది డిమాండ్లు ఒప్పుకున్నాం.. ఇప్పుడు అర్థం చేసుకోవాలన్నారు. ఎన్నికలకు వెళ్తున్నాం కావున.. ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏదో చెబుతాడు.. దానికి ఒక్క ఉదాహరణ కూడా చెప్పలేడని దుయ్యబట్టారు. ట్యాబ్ల కొనుగోలు విషయంలో.. ఏడు వందల కోట్లు. అన్నీ కలిపితే పద్నాలున్నర కోట్లు.. అంతే గాని వందల కోట్లు అవినీతి అని చెప్పాడం సిగ్గు అని మండిపడ్డారు. రెండు మూడు రోజుల్లో డీఎస్సీపై నిర్ణయం వస్తోందని మంత్రి స్పష్టం చేశారు. దీనిపై చర్చలు జరుగుతున్నట్టు తెలిపారు. స్థానిక పరిణామాలు బట్టి ఏ రాజకీయ పార్టీ అయినా మార్పులు చేయడం సహజం అని మంత్రి బొత్స అన్నారు. రాజకీయాల్లో ఆత్మహత్యలే గానీ.. హత్యలు ఉండవు అని వ్యాఖ్యానించారు. సంక్షేమ కార్యక్రమాలు చూసి అన్నీ బాగున్నాయంటేనే నాకు ఓటేయ్యండి అని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అడుగుతున్నాడు.. కానీ, చంద్రబాబు లాగా చెప్పి మోసం చేయలేదన్నారు.