చంద్రబాబు కుట్రలకు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మాగాంధీ చేత రెండో బార్డోలిగా ప్రశంసించబడిన ఈ భీమవరంలో ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి రావడం సెంటిమెంట్‌గా మనం చూస్తున్నాం, నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కేంద్రంగా చేసి ఈ ప్రాంతానికి కీర్తి,ప్రతిష్టలు తీసుకొచ్చిన సీఎంగారికి నా కృతజ్ఞతలు, తెలంగాణలో కేసీఆర్ గారు పరిపాలనా వికేంద్రీకరణ కోసం కొత్త జిల్లాలు ఏర్పాటుచేశారు, కానీ ఇక్కడ చంద్రబాబు మాత్రం గ్రాఫిక్స్‌లో అమరావతి చూపి ప్రజలను భ్రమల్లో ఉంచి అవినీతితో ముంచేశారు, జగనన్నా మీకుటుంబానికి మా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుంది, నాకు చిన్న వయసులోనే నాన్నగారు ఆదరించి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేను చేశారు, ఆ తర్వాత మీరు కూడా అవకాశమిచ్చారు, 2019 ఎన్నికల ముందు నేను పోటీ చేయకూడదనుకున్న సమయంలో జగనన్న నాతో ఒక మాట అన్నారు, నువ్వు పోటీ చేయి, నీ వెన్నంటి ఉంటాను, నాతో నువ్వు ఉండాలన్న ధైర్యంతో యుద్దరంగంలోకి దిగి పవన్ కళ్యాణ్ మీద గెలిచాను, కానీ నేను ఒక గొప్ప వ్యక్తి మీద గెలవలేదనిపిస్తుంది, ఆయన పార్టీ పెట్టినప్పుడు వెనకాల చేగువేరా, మదర్ ధెరిస్సా, పూలే, అంబేద్కర్ ఫొటోలు పెట్టుకున్నాడు, దానిని యువత నమ్మి ఆయన వెంట పరుగులు పెట్టారు, కానీ ఇప్పుడు వారి ఫొటోలన్నీ తీసేసి చంద్రబాబు ఫోటో పెట్టుకున్నారు, మన చంద్రబాబులో చేగువేరా కనిపిస్తున్నారు, పూలే కనిపిస్తున్నారు, అంబేద్కర్ కనిపిస్తున్నారంటూ యువతను వంచిస్తున్నారు, కానీ ఇచ్చిన మాట తప్పకుండా నిరంతరం పేదలు, బడుగు బలహీనవర్గాల కోసం తపిస్తున్న మన సీఎంగారు నిలబడితే పేదలు, రైతన్నల మీద కక్షతో చంద్రబాబు చేస్తున్న కుట్రలు కుతంత్రాలకు ఈ దత్తపుత్రుడు సాయపడుతున్నాడు. చంద్రబాబు మీవి దగా రాజకీయాలు, హత్యారాజకీయాలు, కారంచేడులో దళితుల మీద చేసిన దాడికి, వంగవీటి రంగాను హత్య చేసిన దానికి, జర్నలిస్ట్ పింగళి దశరథరామ్‌ను హత్య చేసిన దానికి, రైతులను కాల్చి చంపినందుకు, అంగన్‌వాడీలను గుర్రాలతో తొక్కించినందుకు, ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినందుకు ఈ తప్పులు అన్నీ ప్రజల ముందు ఒప్పుకుని అప్పుడు ఓట్లు అడుగు, రైతులను, బ్యాంకర్లను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది, ఇచ్చిన హామీలు నెరవేర్చిన జగనన్నను దింపాలని వ్యూహాలు రచిస్తున్న శక్తుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. మనమంతా మన సీఎంగారికి అండగా ఉందాం, స్ధానికంగా ఉన్న కొన్ని సమస్యలు పరిష్కరించాలని సీఎంగారిని కోరుతున్నాను అని తెలిపారు.