గ్రామాలలోని ప్రజలు వచ్చే ఎన్నికలలో టీడీపీని ఆశీర్వదించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. ఈ సందర్భంగా పుంగనూరు మండలం కంగా నెల్లూరు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. టీడీపీ మినీ మేనిఫెస్టో బ్రోచర్ అందజేశారు. అందులోని విషయాలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాధవరెడ్డి, నరేష్, సూరి బాలాజీ, కుమార్, గిరి, సివిరెడ్డి, గంగాధర తదితరులు పాల్గొన్నారు.