ఈ ఏడాది జనవరిలో టీ20ల్లో ప్రవేశపెట్టిన ఇన్-మ్యాచ్ పెనాల్టీని వన్డే మ్యాచ్‌లకు కూడా అప్లై చేయనున్నారు. దీని ప్రకారం ఫీల్డింగ్ టీం నిర్దేశిత సమయంలో బౌలింగ్ కోటాను పూర్తి చేయకపోతే అదనంగా మరొక ఫీల్డర్‌ను ఫీల్డింగ్ సర్కిల్ లోపలకు తీసుకురావాల్సి ఉంటుంది. ఆటలో మిగిలిన ఓవర్లన్నీ అయిపోయే అంతవరకు ఆ ఫీల్డర్ సర్కిల్ లోపలే ఉండాలి. ఈ నిబంధన త్వరలో అమల్లోకి రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa