ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
ప్రధాని మోడీకి ఆయన 5 పేజీల లేఖ రాశారు వైసిపి పాలనలో భూసేకరణ పేరిట రూ.32,141 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారన్నారు. 6.68 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తయితే 86,984 మందికే ఇచ్చారని తెలిపారు. సీబీఐ వంటి సంస్థలతో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు తెలుస్తాయని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa