సైకో జగన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ తుంగలోకి తొక్కేశాడని కళ్యాణదుర్గం టిడిపి ఇంచార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు అన్నారు. శనివారం కళ్యాణదుర్గం పట్టణంలోని ఎన్టీఆర్ భవన్ లో ఆయన విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో 100 శాతం హామీలు నెరవేరుస్తామని, ప్రజలను నమ్మించి చివరికి ప్రజలనే నట్టేట ముంచేసిన ఘనత సైకో జగన్ రెడ్డికే దక్కిందని ఎద్దేవా చేశారు.