ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిపై కమల్ నాద్ అనే యువకుడు మద్యం మత్తులో అత్యాచారం చేశారు. నిందితుని మార్కాపురం రూరల్ ఎస్సై వెంకటేశ్వర నాయక్ శనివారం అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలని మార్కాపురం ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సంబంధిత యువకుడిని కఠినంగా శిక్షించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.