శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు శుక్రవారం ధర్నా చేశారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె.కల్యాణి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు మాట్లాడుతూ.. 18 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సమస్యలు పరిష్కరించేవరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.