మున్సిపల్ కార్మికుల సమ్మె ఐదవ రోజుకు చేరుకుంది. మున్సిపల్ కార్మికుల సమ్మెకు సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రావు, ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు, వామపక్షాలు మద్దతు తెలిపాయి. కోవిడ్ టైంలో మున్సిపల్ కార్మికులు ఎనలేని సేవలను అందించారని శ్రీనివాస్ రావు తెలిపారు. కోవిడ్ సమయంలో సేవలందించినందుకు మున్సిపల్ కార్మికులకు మనిషికి లక్ష రూపాయలు ఇచ్చిన తక్కువే అన్నాడు జగన్మోహన్ రెడ్డి అని గుర్తుచేశారు. ఇప్పుడు కనీస వేతనం కూడా చెల్లించట్లేదని మండిపడ్డారు. డ్రైనేజీలు బాగు చేసే మున్సిపల్ కార్మికులకు, రోడ్లను శుభ్రపరిచే మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం కూడా ప్రభుత్వం చెల్లించలేదా అని ప్రశ్నించారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 ప్రభుత్వం చెల్లించేంత వరకు సమ్మె వదిలే ప్రసక్తే లేదన్నారు. ఒక్కరోజు మున్సిపల్ కార్మికులు వారి విధులను ఆపేస్తే రోడ్లన్నీ భ్రష్టు పట్టుకుపోతాయన్నారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు అన్ని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు వారికి అండగా నిలుస్తాయని శ్రీనివాసరావు పేర్కొన్నారు.