ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు డా. కొలికపూడి శ్రీనివాస్‌రావును అరెస్ట్ చేసేందుకు ఏపీ సీఐడీ ప్రత్యేక బృందం హైదరాబాద్‌కి చేరుకున్నది. 8 మంది సీఐడీ అధికారులు నల్లగండ్లలోని అపర్ణ సైబర్ లైఫ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే కొలికపూడి శ్రీనివాస్‌రావు నివాసానికి చేరుకున్నది. కొలికపూడి హైదరాబాద్‌లో అందుబాటులో లేరని తన సతీమణి చెప్పారు. కొలికపూడి భార్య అప్పటికే ఆఫీసుకు వెళ్లింది. అయితే ఆమెని తన ఇంటికి రావాలని.. కొలికపూడి సమాచారం చెప్పాలని ఏపీ సీఐడీ అధికారులు తనకు తెలిపారు. అపార్ట్మెంట్లోకి ఎలాగైనా వెళ్లాలని సీఐడీ బృందం ప్రయత్నిస్తోంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాగా.. అపార్ట్మెంట్ ఫ్లోర్‌లోకి వచ్చి సీఐడీ బృందం కొలికపూడి శ్రీనివాస్‌రావు కోసం వేచి చూస్తోంది. ఈ రోజు ఎలాగైనా కొలికపూడి శ్రీనివాస్‌రావుని అరెస్ట్ చేయాలని ఐపీ సీఐడీ అధికారులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.