ప్రధాని మోదీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ స్కామ్ జరిగిందని.. అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని లేఖలో పవన్ కోరారు. భూసేకరణ పేరిట రూ.32,141 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారన్నారు. ఇళ్ల పట్టాలు, నిర్మాణంపై ప్రభుత్వం భిన్న ప్రకటనలు చేస్తోందని వపన్ అన్నారు. వాస్తవాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారించాలని కోరారు. టిడ్కో ఇళ్లను కూడా పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు ఇవ్వలేదన్నారు. 6.68 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తయితే 86,984 మందికే ఇచ్చారని పవన్ పేర్కొన్నారు.