సమగ్రశిక్ష ఉద్యోగులు శ్రీకాకుళం కలెక్టరేట్ సమీపంలోని మహాత్మా జ్యోతిబాపూలే పార్కు వద్ద శుక్రవారం వంటా-వార్పు చేపట్టి నిరసన తెలిపారు. అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, విద్యాశాఖలో విలీనం చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సమగ్రశిక్ష జేఏసీ జిల్లా అధ్యక్షుడు పైడి మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరుతూ ఎంపీ రామ్మోహన్నాయుడుకు వినతిపత్రాన్ని అందజేశారు.