రాష్ట్రంలో కాపు సోదరులకు పవన్ ఏం న్యాయం చేశాడు? జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ముసుగులో నుంచి పుట్టిందా..? లేదా..? దీనికి సమాధానం చెప్పాలని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. వైయస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల మీద పవన్‌కళ్యాణ్ చేస్తున్న దాడిని గమనించాలని కోరారు. పవన్‌కళ్యాణ్‌కు రాష్ట్రంలో ఇల్లు లేదు.. ఓటు లేదని, ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఇక్కడ ఓటు లేదని చెప్పారు. కేవలం చంద్రబాబుకు మేలు చేయడం కోసమే పవన్ రాజకీయాలు చేస్తున్నాడన్నారు. చంద్రబాబును సీఎం చేయడం కోసమే పవన్ ఇక్కడకు చుట్టపుచూపుగా వస్తున్నాడని, పవన్‌కళ్యాణ్ కాపుల ద్రోహి అని మండిపడ్డారు.