ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు, తీవ్రవాద కార్యకలాపాలను అడ్డుకునేందుకు పలు చర్యలు చేపడుతున్న కేంద్రం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
కెనడా కేంద్రంగా వేర్పాటువాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్యాంగ్స్టర్ లక్బీర్ సింగ్ లాండా (33)ను ఉగ్రవాదిగా ప్రకటించింది. పలు ఉగ్రవాదులు, దోపిడీలు, హత్యల్లో అతడి ప్రమేయం ఉన్నందున ఉపా చట్టం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది.