ఏపీ మీదుగా అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణించనుంది. జనవరి 7వ తేదీ నుంచి ప్రయాణికులకు రైలు అందుబాటులోకి రానుంది.
మాల్డా టౌన్ నుంచి బెంగళూరు వెళ్లే ఈ రైలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో నిలవనుంది. మాల్దా టౌన్ లో ఉదయం 8:50 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.