చెన్నై నగరంలో న్యూ ఇయర్ వేడుకలను రాత్రి ఒంటి గంటలోపు ముగించాలని గ్రేటర్ చెన్నై పోలీసులు తేల్చిచెప్పారు. 2024 కొత్త సంవత్సరం వేడుకల కోసం ఈవెంట్లు నిర్వహించే సంస్థలు ముందే అనుమతులు తీసుకోవాలని సూచించారు.
ప్రతి ఈవెంట్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని నిర్దేశించారు. ముఖ్యంగా ఈవెంట్లు నిర్వహించే ప్రాంతాల్లో అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని, డీజే సౌండ్లు 45 డెసిబుల్ శబ్దం కంటే ఎక్కువ ఉండరాదన్నారు.