YSRTP అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్కు మద్దతుగా ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే.. వైసీపీ వైసీపీ ఓటు బ్యాంకుకు కత్తెర పడే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.
కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన సీనియర్ నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల్లో కొందరు షర్మిల వెంట నడిచే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి.. షర్మిల వెంట నడుస్తానని ప్రకటించారు.