తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రూ.1000 కోట్ల సమగ్ర సహాయ నిధి ప్యాకేజీని ప్రకటించారు. మిచౌంగ్ తుఫాను తాకిడికి, వర్షబీభత్సానికి గురైన చెన్నై, తిరువళ్లూరు, తూత్తుకుడి, తిరునల్వేలి
సహా ఎనిమిది జిల్లాల్లో తీవ్రంగా నష్టపోయిన ప్రజల కోసం సీఎం స్టాలిన్ ఈ నిధిని విడుదల చేశారు. ఇళ్ల మరమ్మతులు, నిర్మాణానికి రూ.385 కోట్లు, పంట నష్టానికి రూ.250 కోట్లు, వ్యాపారులకు రుణాల కోసం రూ.365 కోట్లు మంజూరు చేశారు.