మనీలాండరింగ్ కేసులో ముగ్గురు వివో- ఇండియా ఎగ్జిక్యూటివ్‌లను ఈడీ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ కోర్డు వారికి బెయిల్ మంజూరు చేసింది.
నిందితులను అరెస్ట్ చేసిన 24 గంటల్లో కోర్టు ముందు హాజరుపరచలేదని, కాబట్టి వారి కస్టడీ చట్టవ్యతిరేకం అవుతుందని తెలిపింది. కాగా, నిందితులు జనవరి 3 వరకు ప్రతిరోజు ఈడీ ముందు హాజరుకావాలని చెప్పింది.