నంద్యాల జిల్లాకి చెందిన గౌరి(32), వెంకట్‌రెడ్డి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. గౌరి తన చిన్న కుమార్తెతో పాటు మహేష్ అనే యువకుడితో ఒంగోలు వచ్చి, నివాసం ఉంటోంది. శుక్రవారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
శనివారం గౌరి ఇంట్లో నుంచి పాప ఏడుపు వినిపించగా.. స్థానికులు వెళ్లి చూడగా గౌరి మృతి చెంది ఉంది. మహేషే గౌరిని హత్యచేసి, ఇంటికి తాళంవేసి వెళ్లిపోయాడని స్థానికులు పోలీసులకు చెప్పారు. మహేష్‌కి కూడా పెళ్లై పిల్లలున్నారు.