ముంబై పోలీసుల కంట్రోల్ రూమ్‌కు ఇవాళ ఉదయం ఓ బెదిరింపు కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ముంబైలోని ఓ ప్రాంతంలో భారీ పేలుడు కానుందని ఈ కాల్‌లో చెప్పారని సమాచారం.
దీంతో పోలీసులు పలు ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్స్ చేపట్టారని అధికారులు చెప్పారు. కాగా, ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ఫోన్ చేసిన వ్యక్తి కోసం కూడా గాలిస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa