ప్రతిపాడు మండలం వైకాపా గ్రామస్థాయి కార్యకర్తలు, శ్రేణులతో గుంటూరు బైపాస్ ఏటుకూరు వద్ద వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో సమీక్షా సమావేశం ఆదివారం నిర్వహిస్తున్నట్లు ప్రతిపాడు వైకాపా కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ సమావేశంలో ఇన్చార్జి బాలసాని కిరణ్ కుమార్ పాల్గొని మండలంలోని వైయస్సార్ పార్టీ పరిస్థితి, రాబోయే ఎన్నికల్లో కార్యచరణ, ప్రణాళికలు, కార్యకర్తల సమీకరణ సంక్షేమ పథకాలు ప్రచారం పై చర్చిస్తారన్నారు.