క్రికెట్లో తాజా రూల్ ప్రకారం, ఒక బ్యాట్స్‌మన్ ఔటైన తర్వాత అతని స్థానంలో వచ్చే మరో బ్యాట్స్‌మన్ మూడు నిమిషాల్లోపే క్రీజులో అడుగుపెట్టాలి. అలా రాకపోతే టైమ్డ్ ఔట్ పేరుతో బ్యాట్స్‌మన్‌ను ఔట్‌గా ప్రకటిస్తారు. తాజాగా శ్రీలంక బ్యాటర్ ఆంజెలో మాథ్యూస్ ఈ విధంగా ఔట్ అయ్యారు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో మాథ్యూస్ క్రీజులోకి రావడానికి మూడు నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకోవడంతో బంగ్లా అభ్యర్థన మేరకు అంపైర్లు ఔట్ ఇచ్చారు.