లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. ఈ మేరకు కసరత్తు కూడా చేసినట్లు సమాచారం. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై కనీసం రూ.4 నుంచి రూ.10 తగ్గించాలని యోచిస్తోంది.
అయితే ఈ భారం చమురు కంపెనీలపై పడకుండా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఒకవైపు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పడుతుండగా మరోవైపు ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో ఇంధన ధరలు తగ్గనున్నాయి.