కాకినాడ జిల్లాలో గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐగా ఎస్. బాలాజీ ఆదివారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గొల్లప్రోలు మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదంక్రీడలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ వినయ్ ప్రతాప్ కాకినాడలో వీఆర్ కు వెళ్ళారు.