ఎన్టీఆర్ జిల్లా, మైలవరంలో సీనియర్ నాయకుడు బొమ్మసాని చలపతి రావు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆదివారం మైలవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైఖరీకి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు బొమ్మసాని ప్రకటించారు. పార్టీ కష్టకాల సమయంలో పని చేస్తే తనకు విలువ ఇవ్వకపోవడంఫై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో వీటీపీఎస్ కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ను ప్రశ్నించారు.