అనంతపురంలో మున్సిపల్ కార్మికుల నిరవదిక సమ్మె 6వ రోజుకు చేరింది. దీంతో మున్సిపల్ కార్మికులు ఆదివారం అర్ధనగ్న ప్రదర్శన చేసి తమ న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ కార్మికుల పట్ల చిత్తశుద్ధి లేని ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.