అనంతపురం రేంజ్ పరిధిలోని అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల ప్రజలకు రేంజ్ డిఐజి అమ్మిరెడ్డి ఆదివారం 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాదిలో జిల్లాలోని రైతులు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, తదితర అన్నివర్గాల ప్రజలు ఆయురారోగ్య, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో కొత్తలక్ష్యాలు ఎంచుకుని అభివృద్ధిపథాన నడావాలని పిలుపునిచ్చారు.