తొలిసారి ఓ ట్రాన్స్ జెండర్ శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి ఆలయంలో జరిగే బ్రహోత్సవాలకు, ప్రతి అమావాస్యకు విచ్చేసే ట్రాన్జెండర్ జోగిని నిషా క్రాంతి ఆదివారం శబరిమల అయ్యప్ప ఆలయంలో స్వామివారిని దర్శించుకుంది.
ట్రాన్స్ జెండర్ ఐడీ ఆధారంగా ఆమెకు కేరళ ప్రభుత్వం దర్శనానికి అనుమతిచ్చింది. ఇది ఒక శుభ పరిణామమని, తనకు దర్శనం కల్పించిన కేరళ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది.