గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరం ఎదుట సోమవారం రోడ్డుపై అంగన్వాడి వర్కర్లు కబడ్డీ ఆడుతూ నిరసన తెలిపారు. సమ్మె పై ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు రేష్మా, గంగా, నాయకులు నాగమణి, జూలీ, పార్వతి, మేరి తేల్చిచెప్పారు. వారి సమ్మెకు సిపిఎం, సిఐటియూ నాయకులు కసాపురం రమేష్, సాకే నాగరాజు, తిమ్మప్ప, సురేంద్ర మద్దతు తెలిపారు.