శెట్టూరు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో గత కొంతకాలంగా అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి సోమవారం టిడిపి మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, టిడిపి నాయకులు మద్దతు తెలియజేశారు. ముందుగా మహిళలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి సమస్యలు పరిష్కరించేంతవరకు ఆందోళనలు ఆగవన్నారు.