కదిరి పట్టణం పాత విజయ టాకీస్ వద్ద సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెంచిన రూ 3000 రూపాయల పెన్షన్ ను ఎమ్మెల్యే డాక్టర్ పి వి సిద్దారెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆనాడు ఇచ్చిన మాటకు కట్టుబడి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2250 నుండి 3000 వరకు వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు అందజేసామన్నారు.