కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామిని రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి సోమవారం దర్శించుకున్నారు. అలాగే స్థానిక ప్రజలను పరిచయం చేసుకున్నాడు. గ్రామ ప్రజలు ఆంజనేయస్వామి చిత్రపటాన్ని బహూకరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బోరంపల్లి గ్రామ సర్పంచ్ వంకా సోమశేఖర్ రెడ్డి, ఆలమూరు కృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa