మడకశిర పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సోమవారం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తి అయిన రాష్ట్రంలో ఒక పరిశ్రమ తీసుకురాలేదని ఎద్దేవాచేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో లక్షలాది మందికి ఉపాధి కల్పించామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తుందని తెలిపారు.