అప్పు చెల్లించలేదని కత్తితో దాడిచేసిన ఘటన తాడిపత్రిలో జరిగింది. బాధిత కుటుంబ వివరాల ప్రకారం శివాలయం వీధికి చెందిన వెంకటరమణ గతంలో రమేశ్ నుంచి రూ. 5వేలు అప్పుగా తీసుకున్నాడు. అది వడ్డితో కలిపి తన అప్పు చెల్లించాలని అడగగా అది గొడవకు దారీ తీసింది. ఈ ఘర్షణలో రమేశ్ కత్తితో పొడిచి పరారయ్యాడు. స్థానిక ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు. ఈ ఘటనపై సోమవారం కేసు నమోదైంది.