అనంతపురం జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని జడ్పీ కార్యాలయ సమావేశ భవన్లో ఈ నెల 5న శుక్రవారం ఉదయం 10: 30 గంటలకు నిర్వహిస్తున్నట్లు జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, జడ్పీ డిప్యూటీ సీఈఓ లలితాబాయి ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు. సమావేశ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు, ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ అధికారులు హాజరుకావాలని కోరారు.