రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అంగనవాడీ సిబ్బంది నిర్వహిస్తున్న సమ్మెలో సోమవారం విన్నూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. లేపాక్షి తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో కార్యకర్తలు, ఆయాలు, కోలాటం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించేవరకు నిరసనలు కొనసాగిస్తుంటామని వారు ఖరాకండిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.