తమ సమస్యల పరిష్కారంలో భాగంగా చేపట్టిన సమ్మెలో అంగణవాడీ కార్యకర్తలు 21వ రోజున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా సోమవారం చిలమత్తూరు తాసిల్దార్ కార్యాలయం ముందు వారు ఒంటి కలుఫై నిలబడి తమ నిరసనను వ్యక్తం చేశారు. అంగణవాడీ కార్యకర్తల యూనియన్ నాయకురాలు శోభారాణి, వనజ, రామతులసీ, శారద, ఈశ్వరమ్మ తదితరులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదన్నారు.