డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ హిందూపురం మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న నిరసనలు సోమవారానికి ఏడవ రోజుకు చేరింది. పట్టణంలోని ధర్మపురంలో ప్రైవేట్ కార్మికులు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తుంటే పారిశుద్ధ్య కార్మికులు అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు. మేము సమ్మెలో ఉంటే మీరు ఎలా వస్తారన్నారు. దీంతో ప్రైవేట్ ట్రాక్టర్లను మునిసిపల్ కార్యాలయానికి తరలించి తాళాలు వేశారు.