కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు క్రిమినల్ చట్టాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ చట్టాలను సవాల్ చేస్తూ అడ్వకేట్ విశాల్ తివారీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
వీటిలో అనేక లోపాలు, వైరుద్ధ్యాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. వీటి ఆచరణ సాధ్యతను మదింపు చేయడం కోసం నిపుణుల కమిటీని తక్షణమే నియమించాలని కోరారు.